18 ఏళ్లుగా డీసీఎం డ్రైవర్స్, ఓనర్స్ ఆధ్వర్యంలో..
తూప్రాన్: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా డీసీఎం డ్రైవర్స్, ఓనర్స్ ఆధ్వర్యంలో 18 ఏళ్లుగా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని డ్రైవర్, ఓనర్స్ అసోసి యేషన్ అధ్యక్షుడు యాదగిరి తెలిపారు. ఉగాది పండుగ రోజున పచ్చడితో ప్రారంభించి మృగశిర వరకు కొనసాగిస్తామన్నారు. నిత్యం నాలుగు డ్రమ్ముల మినరల్ నీటిని (2 వేల లీటర్లు) ప్రజలు తాగుతారన్నారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం చాలా సంతోషంగా ఉందని, అందరం కలిసి ప్రజల కోసం ఓ మంచి పని చేస్తున్నామన్న ఆనందం కలుగుతుందన్నారు.


