పర్యావరణ ఇంజినీర్ తొలగింపు
సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్విరాల్‌మెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న దిలీప్‌రెడ్డిని తొలగిస్తూ మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛ సిద్దిపేట, గ్రీన్ సిద్దిపేట లక్ష్యంగా ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మున్సిపాలిటీలో పర్యావరణ ఇంజినీర్‌గా దిలీప్ రెడ్డి నియామకం అయ్యా రు. కొంతకాలంగా విధులపట్ల నిర్లక్ష్యం, పలు ఆరోపణలు, కౌన్సిల్ తీర్మానం నేపథ్యంలో అతడిని తొలగిస్తూ, అందుకు సంబంధించి సురక్ష ఏజెన్సీతో చేసుకున్న దిలీప్ నియామకం రద్దు చేస్తున్నట్టు వారికి లేఖ రాశారు.
మట్టి టిప్పర్లు పట్టివేత
ముగ్గురిపై కేసు నమోదు,
రూ.15 వేలు జరిమానా
వట్‌పల్లి(అందోల్): అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ వాహనాలను వట్‌పల్లి పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసిన ఘటన శనివారం చోటు చేసుకుంది. జోగిపేట సీఐ అనిల్‌కుమార్ కథనం మేరకు.. శుక్రవారం అర్థరాత్రి గుట్టుగా వట్‌పల్లి గ్రామ శివారులో నుంచి కొందరు టిప్పర్ వాహనాల ద్వారా రేణుక ఎల్లమ్మ ఆలయ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఫంక్షన్ హాలు నిర్మాణం కోసం మట్టిని తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్ వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తహసీల్దార్ శ్రీనివాస్‌కు సమాచారం అందించి వారి సమక్షంలో వాహనాలకు ఒక్కొక్కదానికి రూ.5 వేల చొప్పున మూడింటికి రూ.15 వేలు జరిమానాలు విధించారు. టిప్పర్ వాహనాల డ్రైవర్లు జాన్సన్, మహ్మద్ మోసిన్, జీ.మల్లేశంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య
రెండు నెలల కిందటే వివాహం
చిన్నశంకరంపేట(మెదక్): వివాహమైన రెండు నెలలకే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం అగ్రహారం గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నశంకరంపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన వట్టెపు రాజయ్య కుమారుడు మహేశ్‌కు రెండు నెలల కిందట వెల్దుర్తి మండలం షేరిలా గ్రామానికి చెందిన పూజను ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలోనే యువతి అత్తింట్లో ఉ రేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు యువతి తల్లితండ్రులకు సమాచారం అందించారు. ఆగ్రహానికి గురైన యువతి బంధువులు అత్తింటిపై దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంది. అత్తింటి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. చిన్నశంకరంపేట ఎస్‌ఐ నారాయణగౌడ్, రామాయంపేట సీఐ వెంకటరాజంగౌడ్ తమ సిబ్బందితో వచ్చి యువతి బంధువులను సముదాయించారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించారు.


