లారీ డ్రైవర్‌పై కేసు నమోదు
నర్సాపూర్ రూరల్: చిన్నచింతకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై లింగం ఆదివారం తెలిపారు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని బైక్‌పై నుంచి రోడ్డుపై పడిన ముగ్గురిపై నుంచి లారీ దూసుకెళ్లిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటకు మాల గోపాల్ అతడి కుమారుడు అనుదీప్, తోడళ్లుడు కూతురు సహస్ర మృతి చెందారు. వీరికి మృతికి కారణమైన సూర్యాపేటకు చెందిన లారీ డ్రైవర్ చంద్రబాబును అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
గడ్డి మోపులు దగ్ధం
నర్సాపూర్ రూరల్: గడ్డి మోపులతో వెళ్తున్న ట్రాక్టర్‌కు మంటలు అంటుకున్న ఘటన మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బ్రాహ్మణపల్లి గిరిజన తండాకు చెందిన రమేశ్ నాయక్ ట్రాక్టర్‌లో గడ్డి మోపులను లోడ్ చేసుకొని గ్రామంలోకి వస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్య్కూట్‌తో మంటలు చెలరేగి అంటుకున్నాయి. రమేశ్ నాయక్ చాకచక్యంగా వ్యవహరించి ట్రాలీ హైడ్రాలిక్ లేపడంతో కాలుతున్న గడ్డిమోపులు రోడ్డుపై పడ్డా యి. దీంతో బ్రాహ్మణపల్లి రోడ్డులో ఇరువైపు లా ట్రాఫిక్ స్తంభించిపోయింది. గడ్డిమోపులు కాలిపోవడంతో సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
జహీరాబాద్ టౌన్: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మొగుడంపల్లి మండలం గుడ్‌పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గుడ్‌పల్లికి చెందిన వడ్డె నాగన్న (55) రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. కరెంట్ సరఫరా జరగడంలేదని సర్వీస్ వైర్‌ను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చిరాగ్‌పల్లి పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్‌ను ఢీకొట్టినతుఫాన్ వాహనం
● కూలి పనులకు వెళ్లొస్తూ ఇద్దరు మృతి
నంగునూరు(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం నంగు నూరు మండల రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోహెడ మండలం బస్వాపూర్‌కు చెందిన తాడెం సారయ్య (36), అదే గ్రామానికి చెందిన బండోజు గణేశ్ సిద్దిపేటలో కూలి పనులు ముగించుకొని రాత్రి మోటర్ సైకిల్‌పై స్వగ్రామానికి బయలు దేరారు. ఇదే సమయంలో వరంగల్ మీటింగ్‌కు నుంచి సిద్దిపేట వైపునకు తుఫాన్ వాహనం వెళ్తుంది. మార్గమధ్యలో రాంపూర్ క్రాస్ వద్దకి రాగానే తుఫాన్ వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సారయ్య అక్కడికక్కడే మృతి చెందగా, గణేశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడు రమేశ్‌ను రాజపాల్‌పేట ఎస్‌ఐ ఆసీఫ్, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను పోలీస్ వాహనంలో సిద్దిపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
లారీ డ్రైవర్‌పై కేసు నమోదు


