గాలికుంటు టీకాలు తప్పనిసరి: విజయ్
పటాన్‌చెరుటౌన్: పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే గాలికుంటు టీకాలు తప్పని సరిగా వేయించాలని కేంద్ర పశుసంవర్థక శాఖ జాయింట్ కమిషనర్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామ సమీపంలోని గోశాలలో శుక్రవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి విజయ్ కుమార్ హాజరై వ్యాక్సినేషన్‌పై ఆరా తీయడంతోపాటు గోశాలలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి శైలేంద్ర జస్వాల్, గోశాల కార్యదర్శి గిరిధర్, డాక్టర్ లు జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే
మెరుగైన పాలన
సంగారెడ్డి జోన్: ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన పాలన అందించటం సాధ్యమవుతుందని డీఆర్‌ఓ పద్మజారాణి పేర్కొన్నారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు సమాచార హక్కు చట్టం, గ్రామసభల నిర్వహణ అంశాలపై రెండు రోజులపాటు నిర్వహించిన అవగాహన సదస్సు శుక్రవారంతో ముగిసింది. కలెక్టరేట్ కార్యాలయంలో అవగాహన సదస్సును నిర్వహించారు. గ్రామసభల నిర్వహణ, సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అందించడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్రపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 35 మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మలేరియాపై
జాగ్రత్తలు తీసుకోవాలి
జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి
సంగారెడ్డి: ప్రతీ ఒక్కరూ మలేరియాపై జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ప్రభుత్వాస్పత్రి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించి ఆమె మాట్లాడుతూ...ఈగలు, దోమలు, అపరిశుభ్ర వాతావరణం లేకుండా ప్రతీ ఒక్కరు చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గాలికుంటు టీకాలు తప్పనిసరి: విజయ్
గాలికుంటు టీకాలు తప్పనిసరి: విజయ్


