ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అంగన్‌వాడీలు
జోగిపేట సీడీపీఓ ప్రియాంక
జోగిపేట(అందోల్): ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నట్లు జోగిపేట ఐసీడీఎస్ సీడీపీఓ ప్రియాంక స్పష్టం చేశారు. అంగన్‌వాడీ దినోత్సవాన్ని 6,11,14,15,16 కేంద్రాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలలో 3 నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులను కేంద్రాలలో చేర్పించాలన్నారు. కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. చిన్నారులకు పోషక విలువలు కలిగిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. కేంద్రంలో చిన్నారులకు ఫలితాల సర్టిఫికెట్లు అందించారు.


