
కేదార్‌నాథ్ యాత్రికులకు దక్షిణాది రుచులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌కు సరుకుల లారీలను శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయం నుంచి పంపించనున్నట్లు కేదారినాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని దాసాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ఐదేళ్లుగా కేదార్‌నాథ్ యాత్రికులకు దక్షిణాది రుచులను అందిస్తూ, యాత్రికులకు ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మే 2 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని, అక్కడికి వచ్చే భక్తులకు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ, రాత్రి భోజనం అందించనున్నామని చెప్పారు. శుక్రవారం శరభేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, శివకళ్యాణం నిర్వహించి, లారీలను కేదార్‌నాథ్‌కు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు మాంకాల నవీన్‌కుమార్, మధుసూదన్, రత్నాకర్, శరభయ్య, కాశీనాథ్, గంజి రాములు, రాజేంద్రప్రసాద్, శ్రీనివాస్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
నేడు వెళ్లనున్న సరుకుల లారీలు
కేదారినాథ్ అన్నదానసేవా సమితి సభ్యులు వెల్లడి