
పహల్గాం దాడిని నిరసిస్తూ శాంతి ర్యాలీ
సదాశివపేట(సంగారెడ్డి)/జోగిపేట (అందోల్): జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ సదాశివపేట, జోగిపేటలో పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో కాగాడాలు, కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. ఉగ్ర దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక జోగిపేటలో ధార్మిక సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక క్లాక్ టవర్ నుంచి హనుమాన్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు.

పహల్గాం దాడిని నిరసిస్తూ శాంతి ర్యాలీ