
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
నారాయణఖేడ్: ఉతికిన బట్టలు ఆరవేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. ఈ ఘటన నారాయణఖేడ్ మండలం హుక్రాన (జి) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి థనం ప్రకారం.. ఖేడ్ మండలం హుక్రానా(జి) గ్రామానికి చెందిన రావుల స్వప్న (30) బుధవారం సాయంత్రం ఇంట్లో దుస్తులు ఉతికి ఆవరణలో దుస్తులు ఆరబెట్టడానికి కట్టిన పాత టీవీ కేబుల్ తీగపై దుస్తులను ఆరవేస్తూ విద్యుదాఘాతానికి గురై అరుస్తూ కిందపడిపోయింది. కుటుంబీకులు ఆమెను ఖేడ్ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త రావుల హన్మారెడ్డి, ఈమధ్యే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసుకున్న కుమారుడు సాయిచరణ్ రెడ్డి, 8వ తరగతి పూర్తిచేసుకున్న కూతురు భార్గవి ఉన్నారు. దుస్తులు ఆరవేయడానికి కట్టిన కేబుల్ తీగకు వైర్లు తేలిన విద్యుత్తు తీగ తగిలి విద్యుదాఘాతతానికి గురైనట్లు భావిస్తున్నారు. స్వప్న మృతితో గ్రామంలో విషాదచ్చాయలు అలుముకున్నాయి.