
పిడుగుపాటుకు గేదెలు మృతి
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన రైతు కోర్పతి కృష్ణ రెండు గేదెలు మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. దీంతో రైతు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం జరిగిందని రైతు వాపోయాడు. వ్యవసాయానికి పాడి సంపద ఉపాధిగా ఉండేదని పిడుగుపాటుతో వాటిని కోల్పోవడం వల్ల విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
ధర్మారంలో మరో గేదె
మిరుదొడ్డి(దుబ్బాక): పిడుగు పాటుకు పాడి గేదె మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ధర్మారంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన గూళ్ల బాగులు రోజు మాదిరిగానే పాడి గేదెను వ్యవసాయ పొలం వద్ద కట్టి వేశాడు. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన పిడుగు పడటంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. పాడి గేదె మృతితో సుమారు రూ.60 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.