బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
మిరుదొడ్డి(దుబ్బాక): ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అండర్–19 విభాగంలో బాల బాలికల జట్లను ఎంపిక చేసినట్లు మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భైరయ్య, జనరల్ సెక్రటరీ పీవీ. రవణ తెలిపారు. బుధవారం మిరుదొడ్డిలో వారు మాట్లాడుతూ బాలుర విభాగంలో కె. అక్షిత్, కె. హర్షవర్ధన్, ఎండీ. నిషత్‌మోయిన్, పి. మణికంఠ, బి. లలిత్ చంద్ర, శ్రీరామ భరత్, కె. నవీన్, ఎం. కృష్ణ సాయి, శ్రీరామ భార్గవ్, ఎం. చైతన్య, స్టాండింగ్ ప్లేయర్లుగా వై. భువన్, కార్తీక్ ఆర్య ఎంపికయ్యారని తెలిపారు. అలాగే బాలికల విభాగంలో కె. లలిత సహస్ర, ఎం. శరణ్య, వి. శ్రీతజ రెడ్డి, శ్రీలక్ష్మీ రెడ్డి, సోహా పాతిమా, నిఖత్ సఫియా, ఎన్. శ్రీవాణి రెడ్డి, కె. నిహారిక, జె. గాయత్రి, బి. రాధిక, స్టాండింగ్ ప్లెయర్లుగా సిమ్రాన్ బేగం, రిక్వితలు ఎంపికయ్యారని వారు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 10, 11 తేదీలలో జరిగే రాష్ట్ర స్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.


