రైతన్నా.. కల్తీలతో జర జాగ్రత్తన్నా
● ఒక పరీక్ష నాళికలో ఒక గ్రాం యూరియాను 5 మిల్లీలీటర్ల నీటిలో వేసి బాగా కలియబెట్టాలి. చుక్కల సిల్వర్ నైట్రేట్ ద్రావణం దీనిలో కలపాలి. తెల్లటి అవక్షేపంగా మారితే అది కల్తీ ఎరువుగా గుర్తించాలి.
● పాడిలా తయారు చేసుకున్న గ్రాము డీఏపీని పరీక్ష నాళికలో వేసి 5 మిల్లీలీటర్ల స్వచ్ఛమైన నీటిలో కలపాలి. దీనికి మిల్లీలీటర్ నైట్రిక్ యాసిడ్ వేసి కదిపితే అర్ధ పార్శక ద్రావణం ఏర్పడితే అది నాణ్యమైనదిగా, అలా కాకుండా కరగని పదార్థం అడుగు భాగంలో చేరితే కల్తీదిగా భావించాలి.
● పరీక్ష నాళికలో ఒక గ్రాము మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) ఎరువులో 5 మిల్లీ లీటర్ల నీటిని వేసి బాగా కరిగేటట్లు చేయాలి. కొద్దిపాటి ఎరువు పదార్థం నీటిపై తేలితే స్వచ్ఛమైన ఎరువుగా, ఎక్కువ మొత్తంలో కరగకుండా అడుగుభాగం చేరితే అది కల్తీ ఎరువుగా గుర్తించాలి.
● కాంప్లెక్స్ ఎరువుల విషయంలో గ్రాము ఎరువును 5 మిల్లీలీటర్ల నీటిలో కలిపి బాగా కదపాలి. దీనికి మిల్లీలీటర్ సోడియం హైడ్రాకై ్సడ్ ద్రావణం కలిపి ఒక వైపు నుంచి పరీక్ష నాళికను వేడిచేయాలి. తడిగాఉన్న ఎర్ర లిట్మస్ పేపర్‌ను పరీక్ష నాళిక ద్వారం దగ్గర ఉంచితే లిట్మస్ కాగితం నీలి రంగులోకి మారితే నత్రజని ఉందని గుర్తించాలి. అదే పరీక్షకు 2 మిల్లీలీటర్ల ఫెర్రిక్ క్లోరైడ్ అమ్మోనియం ఎసిఫేట్ కల పాలి. పసుపు రంగు అవక్షేపం వస్తుంది. దీనికి 5–6 చుక్కల నైట్రిక్ యాసిడ్ కలిపితే అవక్షేపం కరిగిపో తుంది. అలా జరిగితే ఫాస్పేట్ ఉన్నట్లు గుర్తించాలి.
● గ్రాము ఎరువును తీసుకుని 5 మిల్లీ లీటర్ల నీటిలో ఎరువును కరిగించాలి. ఫిల్టర్ పేపర్ సాయంతో వడపోయాలి. దీనికి 2 మిల్లీలీటర్ల ఫార్మ డీహైడ్ ద్రావణం కలపాలి. 5 నిమిషాల తర్వాత. ద్రావణం ఎరువులా మారుతుంది. దీనికి సోడియం హైడ్రాకై ్సడ్ ద్రావణం ఒక్కొక్క చుక్క పసుపు రంగు వచ్చేదాకా కలపాలి. దీనికి మిల్లీ లీటర్ కోబాల్ట్ నైట్రేట్ ద్రావణం కలిపితే పసుపు పచ్చ అవక్షేపం ఏర్పడుతుంది. ఇలా జరిగితే ఎరు వులో పొటాష్ ఉన్నట్లు గుర్తించాలి.
● ఎరువుల కొనుగోలు విషయంలో దుకాణం గుడ్‌విల్ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. కొనుగోలు సమయంలో రశీదులు తీసుకోవడం మర్చిపోకూడదు. ఎరువుల పరీక్షలు చేయడం రైతులకు ఇబ్బం ది అనిపించినా, అనుమానం వచ్చినా వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలి.
నకిలీ రసాయన ఎరువుల వాడకంతో దిగుబడిపై ప్రభావం కొనుగోలు చేసే సమయంలోరశీదు తప్పనిసరి హత్నూర మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ సూచనలు
మార్కెట్లో కల్తీ విత్తనాలు, ఎరువులు
మార్కెట్లో కల్తీ విత్తనాలు, నకిలీ మందులు, ఎరువులు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల అప్రమత్తతే శ్రీరామరక్ష. కూరగాయల సాగు, ఉద్యాన, వాణిజ్య పంటల సాగులో అధిక దిగుబడులు సాధిం చాలన్న ఉద్దేశంతో రైతులు అధికంగా ఎరువులు వాడుతుంటారని హత్నూర మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. కొనుగోలు చేసే ఎరువుల్లో కల్తీ ఉంటే దాని ప్రభావం పంట ఎదుగుదలతో పాటు దిగుబడులపై కూడా ఉంటుందన్నారు. ఎరువుల్లో కల్తీని గుర్తించడం, ఎరువులను పరీక్షించడంపై శ్రీనివాస్ సలహాలు సూచనలు ఇలా...
– హత్నూర(సంగారెడ్డి)
పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్లోకి కల్తీ, నాసిరకం, నకిలీ ఎరువులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పోషకాలు తక్కువగా ఉన్న వాటిని రైతులకు అంటగడుతున్నారు. అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం సల్ఫేట్లలో ఉప్పు కలుపుతారు. సూపర్ ఫాస్పేట్లో సుద్దపొడి, జిప్సం, యూరియాలో సాధా రణ ఉప్పు కలిపే అవకాశం ఉంది. ఎంఓపీలో ఇసుక, ఉప్పు కలిపే అవకాశం ఎక్కువగాఉంటుంది. గుళిక రూపంలోని సూపర్ పాస్పేట్ను డీఏపీ లేదా ఎస్పీజే కాంప్లెక్స్ ఎరువులుగా నమ్మించి అమ్ముతుంటారు. సాధారణ ఉప్పును ఎంఓపీగా, లేక సల్ఫేట్గా , మెగ్నీషియం సల్ఫేట్ను జిక్ సల్ఫేట్గా విక్రయిస్తుంటారు.
నాణ్యత పరీక్షలు ఇలా..