అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
ములుగు(గజ్వేల్): వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టుకొని, పోలీసులు కేసు నమోదు చేశారు. ములుగు ఎస్‌ఐ రఘుపతి వివరాల ప్రకారం... మండలంలోని వంటిమామిడి చెక్‌పోస్టు వద్ద బుధవారం వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో గుమ్మడికాయల లోడ్‌తో వస్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనంను తనిఖీ చేయగా అందులో తాళ్లతో కట్టేసిన 10 పశువులు ఉన్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్ నంబూరి గోపి, మరో వ్యక్తి శేరం అప్పలరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నామవరం గ్రామానికి చెందిన ఈగల నాగేందర్(నాని), సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ అజీమ్ ఖురేషీలకు చెందిన పశువులను కాకినాడ జిల్లా జగ్గంపేట నుంచి హైదరాబాద్‌లోని వధశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. పంచనామా అనంతరం పశువులను గోషాలకు, వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.


