
ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు
కంది(సంగారెడ్డి): విద్యార్థులు విద్యతో పాటు సేవాభావం కలిగి ఉండాలని రాజేంద్రనగర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ నరేందర్ రెడ్డి సూచించారు. మంగళవారం కళాశాల విద్యార్థులు కంది మండలంలోని మక్త అల్లూర్‌లో జాతీయ సేవా పథకం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 22 వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎన్‌ఎస్‌ఎస్ వలింటర్లు (విద్యార్థులు) గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత, పంటల సాగులో యాంత్రీకరణ పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడి సాధించడంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ డాక్టర్ అమీర్ బాషా, శ్రీలత, గ్రామస్తులు పాల్గొన్నారు.