సాక్షి, సిద్దిపేట: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్ సమన్వయకర్తలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డికి ఎంఐడీసీ మాజీ చైర్మన్ ఏర్రోళ్ల శ్రీనివాస్, పటాన్‌చెరుకు మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, నర్సాపూర్‌కు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మెదక్‌కు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డిని నియమించారు. అలాగే దుబ్బాకకు మనోహర్‌రావు, గజ్వేల్‌కు జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, సిద్దిపేటకు మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌లు నియమితులయ్యా రు. జహీరాబాద్‌కు దేవిశ్రీప్రసాద్ రావు, అందోల్‌కు డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, నారాయణఖేడ్‌కు మఠం భిక్షపతి, కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్, ఎల్లారెడ్డికి తిరుమల్ రెడ్డి, బాన్సువాడ జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు, జుక్కల్‌కు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఉన్నారు.