కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు విజన్ లేదు: రఘునందన్
పటాన్‌చెరు టౌన్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలకు విజన్ లేదని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఐబీలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డితో కలసి ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా నదీ జలాల అంశంపై తెలంగాణకు ఎన్ని టీఎంసీల నీరు సరిపోతాయో అంగీకరించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పెట్టిన సంతకం తాలూకూ పత్రాలు ప్రజలముందు ఉంచామని చెప్పారు. తెలంగాణకు నష్టం చేయడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు దొందూ దొందేనని విమర్శించారు. రాష్ట్రాన్ని బాగు చేసి పాలమూరుకు నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఈ పార్టీలకు లేదన్నారు. వ్యక్తిగత దూషణలు కాకుండా సబ్జెక్టుపైనే మాట్లాడితే బాగుంటుందని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు హితవు పలికారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్: ఖేడ్ పట్టణ ఓటరుగా సబ్ కలెక్టర్ ఉమాహారతి తన పేరును నమోదు చేయించుకున్నారు. సబ్ కలెక్టర్ పట్టణంలోని రెండవ వార్డులో ఓటరుగా నమోదు చేయించుకున్నారు. ఓటరు జాబితాలో 230 క్రమ సంఖ్యతో ఎస్‌డబ్ల్యూడీ 2226349 ఎఫ్ నంబరుతో ఉమాహారతి పేరుతో ఓటరుగా నమోదు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం చిరునామాను జాబితాలో నమోదు చేశారు.
బొల్లారంలోనే
పోలీస్‌స్టేషన్ సేవలు
జిన్నారం(పటాన్‌చెరు): బొల్లారం పారిశ్రామికవాడలో పోలీస్‌స్టేషన్‌ను తరలించవద్దని ఇటీవల చేపట్టిన నిరసన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి స్టేషన్‌ను స్థానికంగానే కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే పోలీస్ స్టేషన్ కొనసాగింపు నిర్ణయంపై మాజీ జెడ్పీటీసీ సభ్యులు బాల్‌రెడ్డి ఆదివారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ..బొల్లారంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారన్నారు. స్థానికంగా శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా పోలీస్‌స్టేషన్ కొనసాగించడం హర్షణీయమన్నారు.
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పోలీసులు ఆదివారం మైనర్ల డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. టౌన్ ఎస్‌ఐ.వినయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బీదర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఏడుగురు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడగా వారిపై కేసులు నమోదు చేశారు. ఎస్‌ఐ వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు విజన్ లేదు: రఘునందన్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు విజన్ లేదు: రఘునందన్


