కొల్చారం(నర్సాపూర్): గుర్తుతెలియని శవం లభ్యమైన సంఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుపాయల వనదుర్గాదేవి సన్నిధికి వెళ్తున్న భక్తులు.. పోతంశెట్టిపల్లి గ్రామశివారులో ఉన్న మంజీరా వాగులో మృతదేహం ఉందన్న సమాచారం అందించారు. ఘటన స్థలానికి వెళ్లి జాలర్ల సహాయంతో బయటకు తీశారు. చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వయసు 26–28 మధ్య ఉండొచ్చు. అతడి కుడి చేయిపై స్టార్ ఆకారంలో పచ్చబొట్టు ఉంది. బ్లూ కలర్ జీన్ పాయింట్, ఆరెంజ్ కలర్ ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడు. తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఎస్‌ఐ కొల్చారం 87126–57919, మెదక్ రూరల్ సీఐ 87126–57916 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.