పోలింగ్‌ విధుల్లో ఏడు వేల మంది.. | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ విధుల్లో ఏడు వేల మంది..

Published Wed, Nov 29 2023 4:38 AM

-

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో కీలకమైన పోలింగ్‌ ప్రక్రియ ఈనెల 30వ తేదీన జరుగనుంది. ఈ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 13.93 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం మొత్తం 1,609 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 389 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసింది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు.

పోలింగ్‌ విధుల్లో ఏడు వేల మంది..

జిల్లాలో మొత్తం 7,068 మంది పోలింగ్‌ విధులను నిర్వహించనున్నారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలు పోలింగ్‌ ప్రక్రియలో భాగం పంచుకోనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల బృందాల కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఎన్నికల విధులను నిర్వహించనున్న అధికారులు, సిబ్బందిని ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పోలింగ్‌ కేంద్రాలను కేటాయించారు. పోలింగ్‌ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బంది బుధవారం పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లనున్నారు. పోలింగ్‌ సామగ్రీ పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లనున్నారు.

ఎర్రర్‌ ఫ్రీ ఎన్నికలు: కలెక్టర్‌ శరత్‌

ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎర్రర్‌ ఫీ ఎన్నికలు నిర్వహిస్తాం. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆయా నియోజకవర్గాల్లో స్థానికేతరులు బస చేసిన లాడ్జీలు, హోటల్స్‌ ఖాళీ చేసి వెళ్లిపోవాలి. అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి.

మొత్తం ఓటర్లు 13.93 లక్షలు

పురుషులు 7.02 లక్షలు

సీ్త్రలు 6.91 లక్షలు

థర్డ్‌ జెండర్‌ 128

మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 1,609

పోలింగ్‌ సిబ్బంది 7,069

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు 389

వెబ్‌కాస్టింగ్‌ పోలింగ్‌ కేంద్రాలు 1,039

సీసీటీవీ కవరేజ్‌ పోలింగ్‌ కేంద్రాలు 689

వీడియో కవరేజీ పోలింగ్‌ కేంద్రాలు 352

Advertisement
 
Advertisement
 
Advertisement