​​​​​​​ప్రేమించిన అమ్మాయి దక్కలేదని.. | - | Sakshi
Sakshi News home page

​​​​​​​ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..

Apr 7 2024 7:10 AM | Updated on Apr 7 2024 10:59 AM

- - Sakshi

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

మనోహరాబాద్‌(తూప్రాన్‌): ప్రేమించిన అమ్మాయి దక్కలేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మనోహరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ గ్రామానికి చెందిన భ్యాగరి స్వామి చిన్న కుమారుడు ప్రశాంత్‌(24) ఓ పరిశ్రమలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడు ప్రేమించిన అమ్మాయికి ఆరు నెలల కిందట వివాహం కావడంతో తాగుడుకు బానిసయ్యాడు.

శుక్రవారం ప్రశాంత్‌ కుటుంబ సభ్యులతో కలిసి అల్లాపూర్‌లోని తన అక్క ఇంటికి ఫంక్షన్‌కు వెళ్లాడు. అక్కడ అందరిని కలిసి తిరిగి ఇంటికొచ్చిన ప్రశాంత్‌ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తన సెల్‌ఫోన్‌లో తాను ఎవరినైనా బాధిస్తే క్షమించాలని, అందరినీ వీడి పోతున్నాని మేసేజ్‌ చేశాడు. ఇది గమనించిన మిత్రులు ఇంటి వద్దకు వెళ్లి చూడగా సీలింగ్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. మృతుడి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement