భీఫార్మసీ విద్యార్థిని శివానీ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

భీఫార్మసీ విద్యార్థిని శివానీ ఆత్మహత్య

Apr 16 2024 6:45 AM | Updated on Apr 16 2024 8:46 AM

- - Sakshi

మనస్తాపంతో ఉరి వేసుకొని యువతి ఆత్మహత్య

విచారణ చేయొద్దని సూసైడ్‌ నోట్‌

సదాశివపేట(సంగారెడ్డి): ఉరివేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం సదాశివపేట పట్టణంలోని గురునగర్‌ కాలనీలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని అరూర్‌ గ్రామానికి చెందిన మన్నే అశోక్‌ సదాశివపేట పట్టణంలోని గురునగర్‌ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. అశోక్‌ పెద్ద కుమార్తె శివానీ(17) హైదరాబాద్‌లో భీఫార్మసీ చదువుతుంది. రెండు నెలల కిందట సదాశివపేటలోని ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్న శివానీ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు యువతి రాసిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘ నాకు ఇతరులకు సహాయపడటం చాలా ఇష్టం.. నా తల్లిదండ్రుల అనుమతితో నా అవయవాలను దానం చేయాలని కోరుతున్నా.. నేను లేకున్నా నా అవయవాల వల్ల మరో ఇద్దరు జీవిస్తారమోనని నా ఆశ.. నా చావుకు నేనే కారణం.. దయచేసి ఎలాంటి విచారణ చేయొద్దని లేఖలో పేర్కొన్నారు. బ్రెయిన్‌ డెడ్‌ కావడంతో అవయవాలు పనికిరావని వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్‌ గౌడ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement