సదాశివపేట(సంగారెడ్డి): బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు శివరాజ్‌పాటిల్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పెద్దాపూర్ ఎంపీటీసీ ముత్కని అనంతమ్మరాములు, కాంగ్రెస్ చందాపూర్ మాజీ ఎంపీటీసీ పెద్దగొల్ల బక్కన్న పార్టీలో చేరారు. మరోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సేనని అందరూ కలిసి అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపునకు పూర్తిగా సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.