మెదక్ కలెక్టరేట్: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం మెదక్ పట్టణంలోని పిల్లికోటాల్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం... డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద నుంచి ప్రయాణికులతో ఆటో మెద క్ వస్తుంది. ఈ క్రమంలో చంద్రభవన్ కాంప్లెక్స్ సమీపంలో ముందున్న లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఆటో ఎదురుగా వచ్చిన కారు, బైక్ లను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న వారితోపాటు బైక్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో టి.మాందాపూర్ తండాకు చెందిన ధరావత్ బాల్య, అతని భార్య పద్మ, షబానా బేగం, తిరుమల శ్రీనివాస్ ఉన్నారు. వీరిని 108లో మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చే శారు.


