కొండపాక(గజ్వేల్): మండలంలోని జప్తినాచారం సర్పంచ్ లక్కిరెడ్డి పావని ఢిల్లీలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతుల మీదుగా జాతీయ (బీకాన్) అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన సశక్తి పంచాయతీ నేత్రి అభియాన్ సమ్మేళన్ కార్యక్రమంలో మహిళా సర్పంచ్‌ల సామాజిక సంస్కరణల విభాగంలో గుర్తింపును పొందారు. సర్పంచ్‌గా గెలుపొందిన అనతి కాలంలోనే పావని డ్రగ్స్, మద్యపాన వినియోగం వల్ల ఏర్పడే దుష్పరిణాలు, ఇబ్బందులపై గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. అవార్డు పొందిన సందర్భంగా సర్పంచ్‌ను ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అభినందించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అవార్డు పొందడానికి యువత, గ్రామస్తుల సమష్టి కృషి ఫలమేనన్నారు.
దాడికి పాల్పడిన వారిపై కేసు
శివ్వంపేట(నర్సాపూర్): దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి వివరాలు ఇలా... మండల పరిధిలోని కొంతన్‌పల్లి గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్‌పై బుధవారం సాయత్రం బెదిరింపులతో పాటు కొందరు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వెంకట్‌రామిరెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


