మిరుదొడ్డి(దుబ్బాక): విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించకుంటే చర్యలు తప్పవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని అల్వాల చెప్యాల క్రాస్ రోడ్డులో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల/కళాశాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సందర్శించారు. డార్మెటరీతో పాటు, మూత్రశాలలు, మరుగుదొడ్లను పరిశీలించారు. మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వీడాలని అధికారులను మందలించారు. డార్మెటరీలోని నిత్యావసర సరుకులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, నాయకులు రాజులు, భాస్కరాచారి, లింగం, రాజు, బాల్‌నర్సింహులు, దిలీప్, నితిన్ పాల్గొన్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి


