సిద్దిపేటలో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీ (ఇన్‌సెట్‌లో ఆయిల్ స్టోరేజీ ట్యాంకులు)
మహర్దశ
భారతదేశంలో ఆయిల్ కొరతతో ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతోంది. అలాగే ఆ దేశాల్లో యుద్ధం జరిగినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్‌ను సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి.. ప్రస్తుతం 31 జిల్లాల్లో దాదాపు 70వేల మంది రైతులు 2.90లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, నిర్మల్ జిల్లాల్లో అత్యధికంగా పామాయిల్‌ను సాగు చేస్తున్నారు. సాగుకు అనుగుణంగా పరిశ్రమలు ఉండాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు చొరవతో సిద్దిపేటలో పరిశ్రమకు 2023లో శంకుస్థాపన చేశారు. ఈ పరిశ్రమలో పనులు పూర్తయి ఇప్పటికే ట్రయల్ రన్ సైతం పూర్తయింది.
గంటకు 30 నుంచి 120 టన్నులు
అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీలో గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం నుంచి మొదట ప్రారంభించనున్నారు. ఆయిల్ పామ్ పండ్ల ఉత్పత్తి పెరిగే కొద్దీ సామర్థ్యంను గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలును ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఫ్యాక్టరీ నిర్మాణం కావడం దేశంలోనే తొలి పరిశ్రమ ఇది.
వ్యర్థాలతో విద్యుత్
ఆయిల్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. పరిశ్రమ ఆవరణలోనే 4 మెగావాట్ల కో జనరేషన్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. వ్యర్థాలను ఉడికించి స్టీమ్‌తో ఆధునిక టర్బైన్‌లతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఒక యూనిట్‌కు రూ.1.5 మాత్రమే ఖర్చుతో ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనుంది.
కాలుష్య రహిత
కాలుష్య రహితంగా ఫ్యాక్టరీని నిర్మించారు. ఇక్కిడి నుంచి వెలువడే మురుగునీటిని శుద్ధి చేసి రీయూజ్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. భూగర్భ జలాలు అంతరించిపోకుండా ఉంటాయి. నిరుద్యోగులకు ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2వేల మంది వరకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే ఈ నెల 20 నుంచి 22వరకు రైతు మేళా నిర్వహించనున్నారు. మేళా ముగింపు కార్యక్రమం, ఆయిల్ పరిశ్రమ ప్రారంభానికి సీఎం రాక సందర్భంగా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
నర్మెటలో 62 ఎకరాల్లోరూ.300 కోట్లతో నిర్మాణం
వ్యర్థాలతో విద్యుత్ ప్లాంట్
రాష్ట్రంలో 2.90లక్షలఎకరాల్లో సాగు
ఈ నెల 22న ప్రారంభించనున్న సీఎం
ఇక్కడే రిఫైన్డ్


