సిద్దిపేటకమాన్: హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం..సిద్దిపేట పట్టణంలోని సాజీద్‌పూరకు చెందిన ఎండి అర్షద్ స్థానికంగా మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. పక్క దుకాణదారుడైన ఎండి షాబుద్దీన్ తన దుకాణం సరిగా నడవకపోవడంతో దానికి కారణం ఎండి అర్షద్, అతడి తమ్ముడు షాహీద్ అని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 10న షాహిద్ తలపై ఇనుపరాడుతో షాబుద్దీన్ దాడి చేశాడు. అడ్డువచ్చిన అర్షద్‌ను కొట్డాడు. షాహీద్‌ను హైదరాబాద్‌లోని ప్రయివేట్‌కు తరలించారు.


