
ప్రచారంలో భాగంగా ఇసీ్త్ర చేస్తున్న బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డి
బీజేపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని పార్టీ సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సిద్దిపేట పట్టణంలో ప్రచారం ప్రారంభించారు. ఉదయం మార్నింగ్ వాకర్స్ ను కలిసి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. తర్వాత పట్టణంలోని పలు కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ల్యాండ్రీ షాపులో ఇసీ్త్ర చేశారు. ప్రచారంలో పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్, కోడూరి నరేశ్, చెంది సత్యనారాయణ, గోనె మార్కండేయులు, అంబటిపల్లి శ్రీనివాస్, యాదన్ రావు, దాబ నరేశ్, పద్మ, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు. –ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)