కారులో బయలుదేరిన కొన్ని నిమిషాలకే.. విషాదం! | Sakshi
Sakshi News home page

కారులో బయలుదేరిన కొన్ని నిమిషాలకే.. విషాదం!

Published Mon, Nov 6 2023 4:39 AM

- - Sakshi

సాక్షి, సంగారెడ్డి/పటాన్‌చెరు: ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బీడీఎస్‌ సీఐ రవీందర్‌ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌ గోల్కొండకు చెందిన మహమ్మద్‌ సయిద్‌(20), నుమాన్‌ అలీ(19), హసీం, మజిద్‌, ఫైజల్‌ ఆహారం తీసుకునేందుకు కారులో శనివారం రాత్రి సంగారెడ్డి వైపు బయలుదేరారు.

పటాన్‌చెరు మండలం కర్ధనూర్‌ ఓఆర్‌ఆర్‌ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో సయిద్‌, అలీ అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ముగ్గురికి తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో మజీద్‌ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యులు ఆదివారం ఫిర్యాదు చేయగా కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: 'కుమురంభీం వర్ధంతి' వేడుకలో.. ఒక్కసారిగా విషాదం!

Advertisement
 
Advertisement