‘‘రేణుకను చంపేశాను.. వెంటనే వచ్చి శవం తీసుకెళ్లండి’ | - | Sakshi
Sakshi News home page

‘‘రేణుకను చంపేశాను.. వెంటనే వచ్చి శవం తీసుకెళ్లండి’

Aug 23 2023 4:52 AM | Updated on Aug 23 2023 11:11 AM

- - Sakshi

మెదక్: ‘‘రేణుకను చంపేశాను.. వెంటనే వచ్చి శవం తీసుకెళ్లండి’అని ఓ వ్యక్తి తన భార్య బంధువుకు ఫోన్‌ చేశాడు. ఈ సంఘటన నారాయణఖేడ్‌ మండలం సిర్గాపూర్‌ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని వాసర్‌కు చెందిన రేణుక (22)కు, నారాయణఖేడ్‌ మండలం జూకల్‌కు చెందిన కుందేలు శర్ణప్ప (25)తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.

కొంత కాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. శర్ణప్ప తరచూ ఆమెను మానసికంగా వేధించేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించినా అతనిలో మార్పురాలేదు. ఇటీవల వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి రేణుక బంధువైన జగదేవికి శర్ణప్ప చేశాడు.

రేణుకను చంపేశాను, వచ్చి శవం తీసుకెళ్లండని చెప్పడంతో ఆమె కంగుతిన్నది. మంగళవారం ఉదయం బంధువులు వచ్చి వెతకగా గ్రామ శివారులోని బావిలో రేణుక మృతదేహం లభించింది. రేణుకను భర్త, అతని కుటుంబ సభ్యులే హత్య చేసి బావిలక్ష పడేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement