పెరిగిన సహకారం | - | Sakshi
Sakshi News home page

పెరిగిన సహకారం

Nov 19 2026 1:48 PM | Updated on Nov 19 2026 1:48 PM

పెరిగిన సహకారం

నూతనంగా

ఏర్పాటు కానున్న పీఏసీఎస్‌లు

యాచారం: రైతు సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు సౌలాభ్యాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 25 కొత్త పీఏసీఎస్‌ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం)ల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రస్తుతం 56 పీఏసీఎస్‌లు ఉన్నాయి. రైతుల సౌలభ్యం కోసం వీటిని విభజించి, కొత్తగా 26 పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో వీటి సంఖ్య 82కు చేరనుంది. 56 పీఏసీఎస్‌లలో సుమారు లక్షాఎనభై వేల మంది సభ్యులు ఉన్నారు. వీరిలో అరవై వేల మందికి పైగా ఆయా సంఘాల్లో స్వల్ప, దీర్ఘకాలిక, బంగారు, గృహనిర్మాణాలు తదితర పద్దుల కింద రూ.2,200 కోట్ల రుణాలు పొందారు. పూర్వ రంగారెడ్డి జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన వికారాబాద్‌ జిల్లా, పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి పలు మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలిసినప్పటికీ, ఆయా మండలాల పీఏసీఎస్‌ల ఆర్థిక వ్యవహారాలు, సమావేశాలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ డీసీసీబీలోనే కొనసాగుతున్నాయి.

గందరగోళం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పునర్వ్యవస్థీకరణతో కొత్తగా ఏర్పాటైన పీఏసీఎస్‌ల తీరు గందరగోళంగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు, హస్నాబాద్‌, దౌల్తాబాద్‌, మెట్లకుంట తదితర పీఏసీఎస్‌లు రంగారెడ్డి జిల్లాలో కలిసినప్పటికీ ఆయా పీఏసీఎస్‌ల ఆర్థిక వ్యవహారాలు, సమీక్షలు మొత్తం మహబూబ్‌నగర్‌ డీసీసీబీలోనే కొనసాగుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గండేడ్‌ మండలం విభజనలో మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోకి వెళ్లగా, ఈ పీఏసీఎస్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ పరిధిలోనే కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని పలు మండలాల పీఏసీఎస్‌ల ఆర్థిక లావాదేవీలు సక్రమంగా లేకపోవడంతో, విభజనలో భాగంగా ఇవి రంగారెడ్డి జిల్లాలో కలిసినప్పటికీ.. ఇక్కడి డీసీసీబీ పాలకవర్గం వీటిని చేర్చుకోలేదు. అయితే, కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుపై ఏవైనా అభ్యంతరాలు వస్తే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

రంగారెడ్డి జిల్లాలో..

మాతృ పీఏసీఎస్‌ కొత్తగా ఏర్పడనున్నది

మంచాల ఆరుట్ల

యాచారం మాల్‌

ఎంపీ పటేల్‌గూడ ఎలిమినేడ్‌

కందుకూరు నేదునూర్‌

మహేశ్వరం అమీర్‌పేట్‌

శంకర్‌పల్లి దోబిపేట్‌

తలకొండపల్లి వెల్జాల్‌

మాడ్గుల ఇర్వీన్‌

షాబాద్‌ హెతాబాద్‌

అమనగల్లు, తలకొండపల్లి కడ్తాల్‌

కొందుర్గు జిల్లెడ్‌ చౌదరిగూడెం

వికారాబాద్‌ జిల్లా..

వట్టిమీనపల్లి చించల్‌పేట, ఎల్లకొండ

పూడూరు అంగడిచిట్టెంపల్లి

ఎల్మకన్నె గౌతాపూర్‌

నవాంద్గి ఖాసీంపూర్‌

యాలాల లక్ష్మీనారాయణపూర్‌

హస్నాబాద్‌ రుద్రారం

దౌల్తాబాద్‌ గోకఫసల్వాద్‌

శివారెడ్డిపేట అత్వెల్లి

ధారూరు నాగారం

మర్పల్లి పట్లూర్‌

మోమిన్‌పేట ఎన్కతల

మెట్లకుంట దుద్యాల్‌

కుల్కచర్ల చౌడాపూర్‌

బంట్వారం కోట్‌పల్లి

మేడ్చల్‌ జిల్లా..

శామీర్‌పేట: మూడుచింతలపల్లి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 26 పీఏసీఎస్‌ల ఏర్పాటు

ప్రస్తుతం ఉన్న 56 ప్రాథమిక సహకార సంఘాల పునర్విభజన

82కు చేరనున్న మొత్తం పీఏసీఎస్‌లు

ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్‌

అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement