ఎవరిదా కాలు? | - | Sakshi
Sakshi News home page

ఎవరిదా కాలు?

Nov 19 2026 1:48 PM | Updated on Nov 19 2026 1:48 PM

ఎవరిదా కాలు?

● కొనసాగుతున్న పోలీసులు విచారణ

● క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు

● మిస్సింగ్‌ కేసులపై ఆరా

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో కలకలం రేపిన మనిషి కాలు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై పోలీసులు అన్వేషిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ గార్డెన్‌ వెనక, ఓ ప్రార్థన మందిరం సమీపంలో మంగళవారం మనిషి కాలు లభ్యమైన విషయం తెలిసిందే. ఇది ఎవరిదో తేల్చేందుకు పోలీసులు నానాతంటాలు పడుతున్నారు. ఎమైనా ఆధారాలు, ఇతర శరీర భాగాలు లభిస్తాయేమో అనే కోణంలో బుధవారం డాగ్‌ స్క్వాడ్‌, క్లూం టీంతో పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఎవరైనా హత్యచేసి శరీర భాగాన్ని ఇక్కడ పడేసి ఉంటారా అనే కోణంలో.. ఇటీవల మిస్సింగ్‌ కేసులపై దృష్టిసారించారు. కాలు ఎండినట్లు ఉండటంతో కొద్ది రోజుల క్రితమే మనిషి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. సమీపంలోని శ్మశానవాటికల నుంచి శునకాలు పీక్కు వచ్చి ఇక్కడ పడేసి ఉంటాయనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు అధిక శాతం ఈ ప్రాంతలో పనులు చేస్తుంటారు.. అలాంటి వారెవరైనా ఉన్నారా..? అనే దిశగానూ ఆరా తీస్తున్నారు. సర్జరీ చేసి, తొలగించిన కాలు కావచ్చనే అనుమానం కూడా వ్యక్తంచేస్తున్నారు. ఏది ఏమైనా కాలు లభ్యం మిస్టరీ వీడేవరకూ ఈ ఉత్కంఠ కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement