54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు | - | Sakshi
Sakshi News home page

54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలు రద్దు

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

సాక్షి, రంగారెడ్డి జిల్లా: విధులకు హాజరు కాకుండా, షోకాజ్‌ నోటీసులకు స్పందించని 54 మంది లైసెన్స్‌ సర్వేయర్ల సేవలను తక్షణమే రద్దు చేసినట్లు అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) చంద్రారెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 281 మంది లైసెన్స్‌ సర్వేయర్లను నియమించగా, వారిలో 102 మంది విధులకు హాజరుకాకపోవడంతో షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులకు స్పందించి 48 మంది తిరిగి విధుల్లో చేరగా, ఎలాంటి స్పందన ఇవ్వని 54 మంది సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీ సర్వేలో లైసెన్స్‌ సర్వేయర్ల పాత్ర కీలకమని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రీ సర్వే పనుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొని, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. నిర్లక్ష్యానికి తావులేకుండా, నిర్దేశించిన లక్ష్యా లను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు సర్వేయర్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని స్పష్టం చేశారు. విధులకు గైర్హాజరు కావడం, అధికారుల ఆదేశాలను పాటించకపోవడం వంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. విధులకు హాజరుకాని సర్వేయర్ల స్థానంలో కొత్తవా రిని నియమించి రీ సర్వే పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అమరవీరుల స్ఫూర్తితో

పోరాటాలు

ఇబ్రహీంపట్నం: పేద ప్రజల కోసం ప్రాణాలర్పించిన మహబూబ్‌ పాష, నరహరిల స్ఫూర్తితో సీపీఎం ప్రజా పోరాటాలు నిర్వహిస్తోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బోడ సామెల్‌ అన్నారు. స్థానిక పాషనరహరి స్మారక కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మిక, కర్షక, కష్టజీవుల అభ్యున్నతికి నిరంతరం పోరాటం చేసిన పాష, నరహరిలను భూస్వాములు, మతోన్మాదులు కక్షగట్టి దారుణంగా హతమార్చారని గుర్తు చేశారు. వారి వర్ధంతి సభలను గ్రామగ్రామాన నిర్వహించాలని.. ఇబ్రహీంపట్నంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో సోమవారం నిర్వహించే సభకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె.జగన్‌, జిల్లా కమిటీ సభ్యులు పి.జగన్‌, పి.అంజయ్య, ప్రకాశ్‌ కారత్‌, యాదగిరి, విజయ్‌, కార్తీక్‌, కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement