షాద్‌నగర్‌రూరల్: మహిళల్లో అక్షరాస్యతను పెంపొందించి, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర వయోజన విద్యాశాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభు త్వం ఫరూఖ్‌నగర్ మండలంలో ఉర్దూభాష అభ్యసన (ఉల్లాస్) కార్యక్రమాన్ని చేపట్టింది. పట్టణంలో ని మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివా రం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు విద్యావంతులుగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాను న్న మార్చి నెలాఖరు వరకు జిల్లాలో 5,500 మంది మహిళలకు విద్యను అందించి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. మహిళల్లో అక్షరాస్యతను పెంచేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అనంతరం ఉర్దూ అభ్యసన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిత, తహసీల్దార్ నాగయ్య, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహ్మద్ అలీఖాన్‌బాబర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.డి.ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.


