నిబంధనలకే ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకే ప్రాధాన్యత

Oct 25 2026 9:20 AM | Updated on Oct 25 2026 9:20 AM

● ఎప్పటికప్పుడు భూ భారతి దరఖాస్తులకు పరిష్కారం ● ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ లేదు ● స్పష్టం చేసిన టెస్రా

సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూ భారతి దరఖాస్తుల పరిష్కారంలో నిబంధనలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ (టెస్రా యూనియన్‌) పేర్కొంది. భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తులు భారీగా పేరుకుపోవడంపై శనివారం ‘సాక్షి’లో ‘ముట్టజెప్పారా సరి.. లేదంటే కొర్రీ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హులైన రైతులు, భూ బాధితులకు న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడం సాధ్యం కాదని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడటంతో పాటు, చట్టబద్ధమైన హక్కులు కలిగిన వారికి న్యాయం జరిగేలా నిబంధనల ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని వివరించింది. ప్రస్తుతం తహసీల్దార్‌ స్థాయిలో 9,788 అప్లికేషన్లు, ఆర్డీఓ స్థాయిలో 2,801, అదనపు కలెక్టర్‌ స్థాయిలో 8,228, కలెక్టర్‌ స్థాయిలో 2,190 కలిపి మొత్తం 23,007 పెండింగ్‌లో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 3,37,439 దరఖాస్తులు పరిష్కరించినట్లు పేర్కొంది. ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా అధికారులను సంప్రదించాలని సూచించింది. ఇదిలా ఉండగా శనివారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ రాందాస్‌పల్లి సర్వే నంబర్‌ 41లోని బాధిత రైతులను స్వయంగా ఆఫీసుకు పిలిపించుకుని మాట్లాడారు. అర్జీలను ఎప్పటిక ప్పుడు క్లియర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఆర్‌ఐ క్షేత్రస్థాయిలో పర్యటించి పెండింగ్‌ దరఖాస్తులకు నివేదికలు సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement