ఇబ్రహీంపట్నం: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక లిమ్స్ అస్పత్రి సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడీ కార్డులు పంపిణీ చేశారు. లిమ్స్ వైద్యులు డాక్టర్ దినేష్, మేనేజర్ బాషా సిబ్బంది పాల్గొన్నారు.


