మేము మూడెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాం. మా తాతల కాలం నుంచి దీన్నే నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం భూమి తీసుకుంటోంది. తీరా మీ పొలంలో రాళ్లు ఉన్నాయని, అర ఎకరానికి పరిహారం ఇవ్వమని అధికారులు చెబుతున్నారు.
– ఢిల్లీ శ్రీనివాస్, బేగరికంచె
మేము ఆరెకరాల్లో పంటలు సాగు చేస్తున్నాం. ఫ్యూచర్ సిటీ కోసం భూమి తీసుకుంటున్నామని, పరిహారం ఇస్తామని చెబితే అంగీకరించాం. భూమిలో రాళ్లున్నాయని ఎకరం తొలగించి, పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం.
– భద్రమ్మ, బేగరికంచె


