● బొప్పునారంలో ఘటన
బంట్వారం: బంగారం, డబ్బుల విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. ఈ ఘటన బుధవారం బంట్వారం మండలం బొప్పునారం గ్రామంలో చోటుచేసుకుంది. ధారూరు సీఐ రఘురాములు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రమేష్, మల్లేశం అన్నదమ్ములు. రమేష్ భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. మల్లేశంకు కుటుంబం ఉంది. అన్నదమ్ములు వేర్వేరుగా నివసిస్తున్నారు. ఇద్దరూ వ్యవసాయ కూలీలే. బంగారం, డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. సహనం కోల్పోయిన మల్లేశం కత్తితో అన్న రమేష్‌ను హత్య చేశా డు. సమాచారం అందిన వెంటనే ధారూరు సీఐ రఘురాములు, ఎస్‌ఐ విమల ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


