టెక్నాలజీని వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

టెక్నాలజీని వినియోగించుకోవాలి

Sep 23 2026 8:33 AM | Updated on Sep 23 2026 8:33 AM

కేసుల ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి

ఫ్యూచర్‌సిటీ సీపీ తరుణ్‌జోషి

ఇబ్రహీంపట్నం రూరల్‌: కేసుల ఛేదింపులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, సత్వరమే నేరస్తులను పట్టుకునేలా పోలీసులు జాగ్రత్త వహించాలని ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని టీజీపీఏ కార్యాలయంలో మంగళవారం ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ క్రైమ్‌ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ముఖ్యమైన కేసులు, పెండింగ్‌ దర్యాప్తులు, టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌ నిర్వహించాలన్నారు. 66 దర్యాప్తులో ఉన్న కేసులు, 68 ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు ఇతర పెండింగ్‌ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిరంతర సమీక్ష, నాణ్యమైన దర్యాప్తు జరపాలన్నారు. టెక్నాలజీ, డిజిటల్‌ పోలీసింగ్‌ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించి రికార్డులను కచ్చితంగా సకాలంలో అప్‌డేట్‌ చేయాలన్నారు. స్టేషన్‌, ఫీల్డ్‌ స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల నిరోధం, మహిళల భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం, షాద్‌నగర్‌, చేవెళ్ల డీసీపీలు కె.నారాయణరెడ్డి, శిరీష, యోగేష్‌ గౌతమ్‌, ట్రాఫిక్‌ డీసీపీ శివం ఉపాధ్యాయ, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement