పరిగి: బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా టీఆర్‌పీ(తెలంగాణ రాజ్యాధికార పార్టీ) ఆవిర్భవించిందని రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గోల్కొండ కోట నుంచి ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం పరిగి పట్టణానికి చేరుకుంది. బస్టాండ్ ఎదుట నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు అగ్రకులాల చేతుల్లోనే అధికారం ఉందన్నారు. బీసీలకు రాజ్యాధికారం రావాలన్నదే పార్టీ ఏకై క లక్ష్యమన్నారు. టీఆర్‌పీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. మన రాజ్యంలో మనకే అధికారం అనే నినాదంతో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 90శాతం ఉన్న బీసీలకే రాజ్యాధికారం దక్కాలన్నారు. బీసీల జనాభా లెక్కలను తేల్చడంతో గత, ప్రస్తుత ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన ఎస్‌కేఎస్‌లో బీసీలు రెండు కోట్లకు పైగా ఉండగా.. ఇటీవల రేవంత్‌రెడ్డి చేపట్టిన కులగణనలో కోటి 80లక్షల మంది ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీల జనాభా తగ్గడం ఏమిటని ప్రశ్నించారు.
అందుకోసమే టీఆర్‌పీ ఆవిర్భావం
పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న


