నీటి సంపులో పడి బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

నీటి సంపులో పడి బాలుడి మృతి

Sep 23 2026 8:33 AM | Updated on Sep 23 2026 8:33 AM

కేశంపేట: నీటి సంపులో పడిన మేకను రక్షించేందుకు వెళ్లిన బాలుడు మృతి చెందిన సంఘటన కొండారెడ్డిపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన హనుమంతు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో రైతు కృష్ణారెడ్డి వ్యవసాయభూమిని లీజుకు తీసుకొని కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. మహబూబ్‌గనర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కొర్రవంపు తండాకు చెందిన కాట్రావత్‌ దేవి తన కుమారుడు హనుమంతు (13)ను సమీప బంధువైన హనుమంతు వద్దకు పంపించింది. మంగళవారం బాలుడు మేకలను మేపేందుకు వదిలాడు. మేత మేస్తూ ఓ మేక నీటిసంపులో పడిపోగా బాలుడు దానిని బయటికి తీసేందుకు సంపులోకి దిగి అందులో పడిపోయాడు. గమనించిన బంధువులు బాలుడిని నీటిసంపు నుంచి బయటికి తీసి చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి కాట్రావత్‌ దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌హెచ్‌ఓ నరహరి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement