మహా నేత్రోత్సవం | - | Sakshi
Sakshi News home page

మహా నేత్రోత్సవం

Sep 13 2026 11:21 AM | Updated on Sep 13 2026 11:21 AM

ఖైరతాబాద్‌ : ౖఖెరతాబాద్‌లో ఈ ఏడాది (72వ సంవత్సరం) 69 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతికి శనివారం సాయంత్రం నేత్రోనిలనం (కంటిపాప అమరిక) వైభవంగా నిర్వహించారు. దీంతో మహాగణపతి రూపకల్పన పూర్తయినట్లు శిల్పి రాజేంద్రన్‌ ప్రకటించారు. మహాగణపతి ఎత్తు, వెడల్పును బట్టి ఆగమ శాస్త్రంలో సూచించిన విధంగా కంటి ఎత్తు, వెడల్పు కచ్చితమైన స్కేలు ప్రకారం తీర్చిదిద్ది కంటిపాపను అమరుస్తామని, తద్వారా వినాయకుడు నలు వైపుల నుంచి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఉంటుందని తెలిపారు. ఈ మహాగణపతిని దర్శించుకుంటే పంచ భూతాలను దర్శించుకున్నట్లే అని, అలాగే విగ్రహం తయారీకి ఉపయోగించిన రంగులు కూడా ప్రత్యేకమేనని ఆయన పేర్కొన్నారు. ఖైరతాబాద్‌ మహాగణపతితో పాటు నగరంలోని బాచుపల్లిలో 30 అడుగుల వినాయకుడు, ఏపీలోని మచిలీపట్నంలో 63 అడుగుల మట్టి వినాయకుడిని కూడా తానే తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి పూర్తిగా మట్టితో తయారుచేసిన విగ్రహాలే అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement