చేవెళ్ల: పార్టీ బలోపేతానికి కొత్తగా ఎన్నికై న కమిటీల సభ్యులు నూతనోత్సహంతో పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శనివారం ఎమ్మెల్యే కాలెయాదయ్యతో కలిసి నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలు, ఐదు మండలాల్లో ఇటీవల ఎంపికై న పార్టీ నూతన అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. సమన్వయంతో ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్లు శైలజారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, నాయకులు ఆగిరెడ్డి, రాములుగౌడ్, గోపాల్‌రెడ్డి, పాండు యాదవ్, పడాల ప్రభాకర్, రవీందర్, టేకుపల్లి శ్రీనివాస్, కార్తీక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ప్రాకర్రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


