చెరువు.. నీళ్లు కరువు! | - | Sakshi
Sakshi News home page

చెరువు.. నీళ్లు కరువు!

Sep 13 2026 11:21 AM | Updated on Sep 13 2026 11:21 AM

గత ఏడాది మత్తడి దూకి.. ఈసారి వెలవెలబోయి.. వాడిపోతున్న పంటలు నిమజ్జనానికి నీటి గండం

ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్‌, బాలాపూర్‌, మహేశ్వరం, శంషాబాద్‌, గండిపేట, కందుకూరు మండలాల (హైదరాబాద్‌ ఇరిగేషన్‌ డివిజన్‌–1) పరిధిలో వంద ఎకరాలకుపైగా విస్తీర్ణం ఉన్న చెరువులు 60 ఉండగా ఆలోపు విస్తీర్ణంలో ఉన్న చెరువులు, కుంటలు, చెక్‌ డ్యాంలు, కత్వలు 732 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 31,936.28 ఎకరాల ఆయకట్టు ఉంది.

మంచాల, యాచారం మండలాల(హైదరాబాద్‌ ఇరిగేషన్‌ డివిజన్‌–2) పరిధిలో వంద ఎకరాల విస్తీర్ణానికిపైగా ఉన్న చెరువులు 12 ఉండగా, ఆలోపు విసీ్త్రర్ణం ఉన్న చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు, కత్వలు 358 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 7,962.21 ఎకరాల ఆయకట్టు ఉంది.

కేశంపేట నందిగామ, ఫరూఖ్‌నగర్‌, చౌదరిగూడ, కొత్తూరు, కొందుర్గు (షాద్‌నగర్‌ ఇరిగేషన్‌ డివిజన్‌) పరిధిలో వంద ఎకరాలకుపైగా విస్తీర్ణం ఉన్న చెరువులు 28 ఉండగా, ఆలోపు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు, కత్వలు 432 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 13,265.77 ఎకరాల ఆయకట్టు ఉంది.

శంకర్‌పల్లి, చేవెళ్ల, మొయినాబాద్‌, షాబాద్‌ మండాల (చేవెళ్ల ఇరిగేషన్‌ డివిజన్‌) పరిధిలో వంద ఎకరాలకుపైగా విస్తీర్ణం ఉన్న చెరువులు 20 ఉండగా, ఆలోపు చెరువులు, కుంటలు, చెక్‌ డ్యాంలు, కత్వలు 187 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 7,780.69 ఎకరాల ఆయకట్టు ఉంది.

తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్‌, మాడ్గుల మండల (కల్వకుర్తి ఇరిగేషన్‌ డివిజన్‌) పరిధిలో వంద ఎకరాలకుపైగా విస్తీర్ణం ఉన్న చెరువులు 17 ఉండగా, ఆలోపు చెరువులు, కుంటలు, చెక్‌ డ్యాంలు, కత్వలు 281 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 10,170.25 ఎకరాల ఆయకట్టు ఉంది.

– మరిన్ని చిత్రాలు 8లోu

మంచాల: గత ఏడాది నీటితో కళకళలాడిన పెద్దబంధం చెరువు

మంచాల: ప్రస్తుత పరిస్థితి

కడ్తాల్‌: రావిచేడ్‌లో గతేడాది అలుగుపారుతున్న నాగోని చెరువు

కడ్తాల్‌: ప్రస్తుత పరిస్థితి

జిల్లాలో సగానికిపైగా ఖాళీ

ఐదేళ్లలో నమోదైన వర్షపాతం (మి.మీ.)

సంవత్సరం జూన్‌ జూలై ఆగస్టు

2021–22 90.3 315.8 147.9

2022–23 126.0 346.1 147.9

2023–24 82.6 307.7 34.04

2024–25 97.0 145.3 145.0

2025–26 73.8 221.8 316.4

2026–27 141.2 143.6 100.4

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురకపోవడంతో జిల్లాలోని మెజార్టీ చెరువులు, కుంటలు నీళ్లు లేక ఖాళీగా కన్పిస్తున్నాయి. గత ఏడాది నవరాత్రులకు ముందే చెరువులు, కుంటలన్నీ మత్తడి దూకాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో నీళ్లు చేరలేదు. ఈసారి 40 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు లేక ఇప్పటికే వరి సహా ఇతర పంటలు వాడిపోతున్నాయి. జిల్లాలో 2,127 చెరువులు, కుంటలు ఉండగా వీటిలో చాలావరకు రియల్టర్ల చేతిలో బందీగా మారాయి. చెరువుల్లోకి వరదనీటిని చేర్చే వాగులు, వంకలు ధ్వంసమయ్యాయి. ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలోని చెరువులు, కుంటల్లోకి సమీప నివాసాలు, పారిశ్రామికవాడల నుంచి వెలువడిన వ్యర్థాలు, మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతున్నాయి.

ఆనవాళ్లు కోల్పోయిన చెరువులు, కుంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement