లోక్‌ అదాలత్‌తో రాజీమార్గం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌తో రాజీమార్గం

Sep 13 2026 11:21 AM | Updated on Sep 13 2026 11:21 AM

ఆమనగల్లు: లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమనగల్లు జూనియర్‌ సివిల్‌జడ్జి అరుణకుమార్‌ సూచించారు. పట్టణంలోని కోర్టులో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పలు కేసులను పరిష్కరించారు. అంతకుముందు జడ్జి మాట్లాడుతూ.. ఇరువర్గాలు రాజీపడి కేసులు పరిష్క రించుకోవడానికి లోక్‌ అదాలత్‌ మంచి అవకా శం అని అన్నారు. ఇరువర్గాలు గెలిచినట్టే అని తెలిపారు. ఇరువర్గాల రాజీతో సత్వరన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్‌ మురళీధర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్తీక్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యాదీలాల్‌, కోశాధికారి మల్లేశ్‌, గ్రంథాలయ కార్యదర్శి గణేశ్‌గౌడ్‌, క్రీడా కార్యదర్శి సంతోష్‌కుమార్‌, న్యాయవాదులు, సీఐలు, వివిధ బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

203 కేసుల పరిష్కారం

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, గ్రీన్‌సిటీ ఫార్మా, మాడ్గుల పోలీస్‌స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో క్షక్షిదారులు రాజీపడ్డారు. స్థానిక న్యాయస్థానం వద్ద శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో సుమారు 203 కేసులు పరిష్కారమయ్యాని ఏసీపీ కేవీపీ రాజు తెలిపారు.

మంత్రి సీతక్కకు సన్మానం

చేవెళ్ల: పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా మహిళా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్య క్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాభవన్‌లో మంత్రిని కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా సర్పంచుల సంఘం అధ్యక్షురాలు తిప్పని మాధవిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు

చేవెళ్ల: ప్రజల్లో కాంగ్రెస్‌పార్టీకి ఆదరణ లేదనే భయంతో ఎన్నికలకు వెళ్లకుండా సొసైటీ పదవులను నామినేటెడ్‌ పద్ధతిలో కట్టబెడుతున్నారని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ మాల్గారి వైభవ్‌రెడ్డి విమర్శించారు. చేవెళ్లలో శనివారం ఆయన బీజేవైఎం నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు. ప్రజా స్వామ్యబద్ధంగా నిర్వహించాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే దమ్ము లేద న్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, పార్టీ గుర్తుపై ఎన్నికలకు వెళ్తే తిరస్కరిస్తా రనే భయం పట్టుకుందన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

చిన్నారితో

అసభ్య ప్రవర్తన

వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

యాచారం: తొమ్మిదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక దాడికి యత్నించిన ఓ వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. యాచారం మండల పరిధిలోని ఓ గ్రామంలో నాలుగో తరగతి చదివే ఓ చిన్నారి తోటి స్నేహితులతో కలిసి ఎదురింట్లోకి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఆఇంట్లోని 35 ఏళ్ల వ్యక్తి చిన్నారితో అసభ్యంగా ప్రవరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి రక్షించారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement