చేవెళ్ల: మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డిని చేవెళ్ల బీఆర్‌ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నగరంలోని ఆమె నివాసానికి చేరుకుని పరామర్శించారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ సమాజం మండిపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న మోసాలు, దౌర్జన్యాలపై గట్టిగా పోరాడాలని సూచించారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆమెను కలిసిన వారిలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.క్రిష్ణారెడ్డి, గోనె కరుణాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కుర్వ మల్లేశ్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, తలారి యాదయ్య, డీఎం.చందు, వెంకటేశ్వర్‌రెడ్డి, దండు సత్యం, వెంకటేశ్, రామగౌడ్, క్రిష్ణారెడ్డి, రాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, కృష్ణ, రామకృష్ణారెడ్డి, మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు.
● ఉప్పల్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌పై కేసు
సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో ఏకంగా పదకొండేళ్లు సహజీవనం చేసి మోసం చేసిన కానిస్టేబుల్ అరుణ్ కుమార్‌పై ఉప్పల్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తనకు ఇష్టం లేకుండా రెండుసార్లు గర్భస్రావం చేయించాడని, పెళ్లికి ముహూర్తాలు పెట్టి కూడా మరో యువతిని వివాహం చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గత నెల ఆఖరి వారంలో ఈ కేసు నమోదు కాగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్ ప్రశాంత్‌నగర్‌కు చెందిన యువతితో అరుణ్‌కుమార్‌కు 2013లో పరిచయమైంది. 2014లో అరుణ్‌కుమార్ తనను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నమ్మిన తాను అతడితో సన్నిహితంగా మెలిగానని తెలిపారు. ఈ ఏడాది నవంబరు 1న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అరుణ్‌కుమార్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో ఆగస్టు 24న ఉదయం సుమారు 7.30 గంటలకు అతడి ఇంటికి వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. అక్కడ వాచ్‌మెన్‌తో పాటు కుటుంబ సభ్యులను ఆరా తీయగా..అరుణ్‌కుమార్‌కు అప్పటికే పెళ్లయిపోయిందనే విషయం తెలిసిందని పేర్కొన్నారు. అతడు ఈ ఏడాది జూలై 1న మరో యువతిని వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందని యువతి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సత్తార్
అనంతగిరి: నర్సరీలు ఏర్పాటు చేసేవారు, ఇప్పటికే నిర్వహిస్తున్న వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎంఏ సత్తార్ ఆదేశించారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నర్సరీలను ఏర్పాటు చేయరాదన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని నర్సరీల యజమానులకు తెలంగాణ నర్సరీ చట్టంపై అవగాహన కల్పించారు. కూరగాయలు, పూలు, పండ్ల మొక్కల నారు పెంచుతున్న వారు ఉద్యాన శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు. నాణ్యమైన నారు సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు కమల, సురేంద్రనాథ్, యమున, సంతోష్ కుమార్, అక్షిత రెడ్డి, ఉద్యాన విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
పరిగి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పరిగి పోలీసులు పట్టుకున్నారు. అయితే గోప్యత పాటిస్తున్నారు. బుధవారం ఉదయం మండలంలోని రాఘవాపూర్ వద్ద ఓ వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఎన్ని క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు.. నిందితులు ఎవరు అనే విషయాలు వెల్లడించడం లేదు.
దోమ: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై ఆవు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కుమ్మరికుంట తండాలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత రైతు కేతావత్ తుల్చా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. తన వద్ద ఉన్న పశువుల్లో ఓ ఆవు కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికాడు. గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో కరెంట్ షాక్‌కు గురై చనిపోయింది. ఆవు విలువ రూ.50 వేలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


