సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామ పంచాయతీలు సజావుగా సాగాలన్నా, నిర్వహణ సక్రమంగా ఉండాలన్నా ఉప సర్పంచ్‌ల జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేయాలని సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.శివశంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సర్పంచ్‌ల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ సునీల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిధులు, విధులు ఉండేవి సర్పంచ్‌లకు మాత్రమేనని వారికి మాత్రమే చెక్‌పవర్ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. పంచాయతీలకు రావాల్సిన మైనింగ్, స్టాంప్‌డ్యూటీ, సినరేజ్ ఫీజులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం వెంటనే జాయింట్ చెక్‌పవర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గణేశ్, శ్రీనివాస్‌నాయక్, పద్మకృష్ణ, రవి, శ్రీనివాస్, రమేశ్ తేజ నాయక్, శంకర్, కోటేశ్వర్‌గౌడ్, చంద్రబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రాజెక్ట్ ప్రగతి’ పేరిట 5 ప్రాంతాల్లో ఏర్పాటు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేస్తున్న గిగ్, డెలివరీ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం, జెప్టో సంస్థ సంయుక్తంగా ‘ప్రాజెక్ట్ ప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా నగరంలో 5 ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందం కుదిరింది. 2024లో నిర్వహించిన ఒక సర్వేలో 69 శాతం మంది కార్మికులకు శుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో లేవని, 80 శాతం మందికి విశ్రాంతి కోసం నీడ లేదా చల్లని ప్రదేశం లభించడం లేదని తేలింది. ఈ లోటును తీర్చేందుకు వారికి తగిన సదుపాయాలు కల్పిస్తూ ప్రాజెక్ట్ ప్రగతి పేరిట సదుపాయాల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో విశ్రాంతి స్థలం, తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, వైఫై సౌకర్యం లభించనుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, జెప్టో సీఓఓ వికాస్ శర్మ, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, తదితరులు పాల్గొన్నారు.


