సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీ | - | Sakshi
Sakshi News home page

సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీ

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

షాద్‌నగర్‌: సమాజాన్ని జాగృతం చేసిన కవి కాళోజీ నారాయణరావు అని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఉద్యమకారుల సంక్షేమ సంఘం భవనంలో కాళోజీ నారాయణ రావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వెంకట్‌రాంరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషకు, యాసకు కాళోజీ వన్నె తెచ్చారని కొనియాడారు. తెలంగాణ, స్వాతంత్య్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ఆదర్శంగా నిలిచారని చెప్పారు. తెలంగాణ ప్రజల హక్కులు, స్వాభిమానం, సామాజిక చైతన్యం కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటేశ్‌, రవిగౌడ్‌, సునీల్‌రెడ్డి, విఠలయ్య, రాజు, శేఖర్‌, మల్లేశ్‌, ప్రభాకర్‌, సునీల్‌రెడ్డి, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

టీజేఏసీ ఆధ్వర్యంలో..

పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్థూపం వద్ద కాళోజీ జయంతిని తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో తాలూక చైర్మన్‌ జనార్ధన్‌, నాయకులు కరుణాకర్‌, బాల్‌రాజ్‌, శ్రీనివాస్‌, శ్రీహరి, రామారావు, సుజీవన్‌, కృష్ణయ్య, వెంకటరమణ, క్రాంతికుమార్‌, రాము, వేణుగోపాల్‌, శ్రీధర్‌, ముబారక్‌, చందు, షర్ఫొద్దీన్‌, మనీశ్‌ పాల్గొన్నారు.

ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement