మద్యానికి డబ్బులు ఇవ్వలేదని | - | Sakshi
Sakshi News home page

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని బీజేవైఎం నాయకుడికి ఎంపీ పరామర్శ

మేస్త్రీ ఆత్మహత్య

మొయినాబాద్‌: మద్యం తాగి వచ్చిన మేస్త్రీ భార్యను డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మొయినాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం ఘనపురం గ్రామానికి చెందిన లేగల బుచ్చయ్య(45) భార్య, పిల్లలతో కలిసి మొయినాబాద్‌లో అద్దెకు ఉంటూ మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు మద్యం తాగే అలవాటు ఉంది. బుధవారం ఉదయం పనికోసం మొయినాబాద్‌లోని అడ్డమీదకు వెళ్లాడు. ఉదయం 10 గంటల వరకు పని దొరక్కపోవడంతో మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న బుచ్చప్ప భార్య భాగ్యమ్మను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని.. సాయంత్రం ఇస్తానని చెప్పడంతో ఇంట్లోని గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో భార్యకు అనుమానం వచ్చి తలుపులు తట్టింది. ఎలాంటి స్పందన రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూసే సరికి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘనటా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

మొయినాబాద్‌ రూరల్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ, బీజేవైఎం చేపట్టిన అసెంబ్లీ ముట్టడిలో పోలీసుల లాఠీచార్జీ ఎంతవరకు సమంజసమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనలో గాయపడిన బీజేవైఎం నాయకుడు శ్రీకాంత్‌ను బుధవారం మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, నాయకుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. ఉద్యమ ఉధృతి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే పోరాటం అభినందనీయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, బట్టు జ్ఞానేశ్వర్‌, రెడ్డిపల్లి సర్పంచ్‌షాపురం రాజు, బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement