అభివృద్ధిలో కలిసి సాగండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో కలిసి సాగండి

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

మున్సిపాలిటీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభం

చేవెళ్ల: మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. 17 వార్డు రంగారెడ్డి కాలనీలో 50 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను బుధవారం స్థానిక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేవర సమతారెడ్డి, కౌన్సిలర్లుతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటి అభివృద్ధికి కావాల్సిన నిధులు విడుదల చేయిస్తానని తెలిపారు. కొత్త మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి పనిచేయాలని పాలకవర్గానికి సూచించారు. ఏన్నో ఏళ్లుగా ఉన్న రంగారెడ్డి కాలనీలోని సీసీ రోడ్డు సమస్య తీరడంతో కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రోడ్డు నాణ్యతతో వేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపాల్‌ పాలకవర్గం సభ్యులు, అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

టీయూటీఎఫ్‌డీసీ నిధులు మంజూరు

ఎమ్మెల్యే కాలె యాదయ్య సహకారంతో మున్సిపాలిటీకి రూ.28.5కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ నిధులు మంజూరైనట్లు చైర్‌పర్సన్‌ దేవర సమతారెడ్డి తెలిపారు. ఈ నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, పారిశుద్ధ్య పనులు పూర్తి చేస్తామాన్నరు. తెల్లవారుజామున పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన పనులను పరిశీలించి, సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement