భగీరథ నీటిని పొదుపుగా వాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భగీరథ నీటిని పొదుపుగా వాడుకోవాలి

Sep 10 2026 8:41 AM | Updated on Sep 10 2026 8:41 AM

షాద్‌నగర్‌ రూరల్‌: ప్రభుత్వం సరఫరా చేస్తున్న మిషన్‌ భగీరథ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని మిషన్‌ భగీరథ క్వాలిటీ కంట్రోల్‌ ఏఈఈ సునీల్‌ సూచించారు. బుధవారం ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామంలో భగీరథ నీటి సరఫరా, క్వాలిటీ, క్వాంటిటీ, పంచాయతీ రికార్డులను పరిశీలించారు. గ్రామంలో మిషన్‌భగీరథ నీటి సరఫరా ఎలా ఉంది, ఇంటింటికి ఎన్ని రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతుంది, కుళాయిలు ఏ విధంగా పని చేస్తున్నాయనే విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం మిషన్‌ భగీరథ నీటిని అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఇంట్రా ఏఈఈ అభినవ్‌, పంచాయతీ కార్యదర్శి తేజస్విని, అంగన్‌వాడి టీచర్‌ రోజా తదితరులు పాల్గొన్నారు.

క్వాలిటీ కంట్రోల్‌ ఏఈఈ సునీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement