హామీలపై నిలదీస్తారనే దౌర్జన్యాలు | - | Sakshi
Sakshi News home page

హామీలపై నిలదీస్తారనే దౌర్జన్యాలు

Sep 8 2026 7:21 AM | Updated on Sep 8 2026 7:21 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రజలకు రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఇచ్చిన బూటకపు హామీలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిలదీస్తారనే అసెంబ్లీకి వెళ్లనీయకుండా పోలీసులతో దౌర్జన్యంగా అడ్డుకున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. పార్టీ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంగళ్‌పల్లి గేటు వద్ద సాగర్‌రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో నెరవేరుస్తామని ఇచ్చిన హామీలను వెయ్యి రోజులైనా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ మోసాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో అధికార పార్టీకి వెన్నులో వణుకు మొదలైందన్నారు. మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరు యావత్‌ తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఇప్పటికై నా అణచివేతలు మానుకొని హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్తు వెంకటరమణారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, కర్నాటి రమేష్‌గౌడ్‌, చీరాల రమేష్‌, బుగ్గరాములు, ఏర్పుల చంద్రయ్య, కృపేష్‌, బూడిద రాంరెడ్డి, నీలం శ్వేత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు,

మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement